ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల మహాపాదయాత్ర

SMTV Desk 2019-02-02 18:07:08  Andhra Pradesh, pension process, Lecturers, Mahapadayatra, Vijayawada, Guntur, eluru

అమరావతి, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరి పెన్షన్‌ విధానాన్నిఅమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 3 తేదీ నుంచి 5 వరకు మహాపాదయాత్రను చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు.

అసెంబ్లీ సమావేశాల్లో సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు రెండు టీం లుగా విడిపోయి గుంటూరు, ఏలూరు నుంచి మహాపాదయాత్రను మొదలుపెట్టి విజయవాడ చేరుకోనున్నట్లు తెలపారు.