మిస్టరీగా మారిన జయరాం హత్య : శిఖా చౌదరి, శ్రీకాంత్, రాకేష్ వీళ్ళలో ఎవరు హంతకులు...?

SMTV Desk 2019-02-02 17:46:50  NRI Jayaram, Express TV Chairman, Murder Case, Mystery, Chigurupati jayaram, Shikha chaudary

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ప్రముఖ పారిశ్రామిఖవేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ చౌదరి హత్యకేసులో పోలీసులు నాలుగు బృందాలుగా వీడి దర్యాప్తు వేగాన్ని పెంచారు. హైదరాబాదులోని ఆయన ఇంటి వద్ద గల సిసీటీవీ ఫుటేజీలను నందిగామ పోలీసులు పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులను, బంధువులను ప్రశ్నిస్తున్నారు. వ్యాపార లావాదేవీలు, కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత లావాదేవీల కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. జయరామ్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదిలావుంటే, చిగురుబాటి హత్యకు సంబంధించి ఆయన డ్రైవర్ సతీష్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. హైదరాబాద్‌ నుంచి ఆయనొక్కరే వొంటరిగా కారులో బయలుదేరారని చెబుతున్నారు. కానీ టోల్‌ప్లాజా సీసీటీవీల్లో ఓ తెల్లరంగు చొక్కా ధరించిన వ్యక్తి కారును నడిపినట్లు చూపిస్తోంది. ఆ కారులో ఉన్న మరో వ్యక్తి ఎవరనే విషయాన్ని కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కారులో బీరు సీసాలు ఉండడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఎవరితోనేనా కలిసి జయరాం పార్టీ చేసుకున్నారా అనేది ప్రశ్నగానే మిగిలింది. పార్టీ చేసుకున్న తర్వాత అతన్ని చంపేసి ఉంటారా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే చిగురుపాటి జయరాం కారు డ్రైవర్ చెబుతున్న విషయాలు కేసును మలుపు తిప్పే అవకాశం ఉంది. చిగురుబాటికి బయట మద్యం తీసుకునే అలవాటు లేదనీ, అసలు బీరు తాగరని కారు డ్రైవర్ సతీష్ చెప్పాడు. అంతేకాకుండా రాత్రి వేళల్లో అసలు ప్రయాణం చేయరని చెప్పాడు. ఆయనకు పెద్దగా శత్రువులు ఉన్నట్లు కూడా తనకు తెలియదని చెప్పారు. జయరాం జనవరి 21వ తేదీన జరిగిన కోస్టల్‌ బ్యాంక్‌ సమావేశంలో పాల్గొన్నారు. క్రమంగా తన మకాంను హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన డ్రైవర్‌ సతీశ్‌కు బుధవారం సాయంత్రం ఈ విషయం చెప్పి గురువారం ఉదయం ఇంటికి రావాల్సిందని చెప్పాడు. గురువారం ఉదయమే సతీష్ ఆయన నివాసానికి వెళ్లాడు. సతీష్ వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండంతో ఫోన్‌ చేశాడు. ఎంతకీ లిఫ్ట్‌ చేయకపోవడంతో జయరాం బంధువులు, సన్నిహితుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశాడు. జయరాంకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు. అయితే వారిని వద్దని బుధవారం సాయంత్రం స్వయంగా తన కారులో ఇంటి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు.





నందిగామ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఆయన తల, శరీర భాగాలపై బలమైన గాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చేప్పుడు జయరాం మరొకర్ని వెంట తీసుకొని వచ్చారా, లేక హైదరాబాద్‌ శివార్లలోనే జయరాంను హత్య చేసి కారులో తీసుకొచ్చి ఐతవరం వద్ద వదిలేసి పారిపోయారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. జయరాంకు కుటుంబం, ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నాయని సమాచారం. విజయవాడ రామవరప్పాడు రింగ్‌ రోడ్డుకు సమీపాన ఉన్న ఓ స్థలం విషయంలో కుటుంబ సభ్యులతో గొడవలు నడుస్తున్నాయని పోలీసులు గుర్తించారు. జయరాం కారును ఓ తెల్లటి దుస్తులు ధరించి ఉన్న వ్యక్తి నడిపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా బయటపడింది. చిగురుపాటి జయరాం కారులో ఓ మహిళ ఉన్నట్లు తెలిసింది. చిగురుపాటి జయరాం కాల్ డేటా ఆధారంగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జయరాంను విషప్రయోగం చేసి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. శరీరం నీలం రంగుకు మారి ఉండడం వల్ల పోలీసులు ఆ ఆ నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా, చిగురుపాటికి బలమైన గాయాలు తగలలేదని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆయన ముక్కు నుంచి, చెవుల నుంచి రక్తం కారినట్లు గుర్తించారు. మద్యంలో సైనెడ్ కలిపి తాగించారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. గురువారం సాయంత్రం మాత్రం తాను విజయవాడ వస్తున్నానని బస చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వారికి సూచిస్తూ విజయవాడలో ఉన్న తన సిబ్బందికి ఫోన్‌ ద్వారా మేసేజ్‌ పంపించారు. తర్వాత ఆయన భార్యతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో ఏం మాట్లాడారనే విషయాలు తెలియరాలేదు. అయితే, రెండేళ్లుగా ఆయనకు కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని తన బస ఏర్పాట్ల గురించి పంపిన మేసేజ్‌ ఆయన ఫోన్‌ నుంచి వెళ్లిన లాస్ట్‌ మేసేజ్‌గా పోలీసులు గుర్తించారు. తరువాత కొద్ది గంటల్లోనే ఆయన అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డారు. కాగా, ఆయన హత్యకు సంబంధించి పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ కింది ప్రశ్నలకు పోలీసులు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

1. హత్య జరిగిన సమయంలో కారులో ఉన్న మహిళ ఎవరు?
2. భార్యా పిల్లలకు ఇవ్వని ప్రాముఖ్యం ఆమెకు ఎందుకు ఇచ్చారు?
3. జయరామ్ కారును నడిపిందెవరు?
4. హైదరాబాదు నుంచి బయలుదేరిన సమయంలో కారులో ఉన్నదెవరు?
5. జయరాం చివరి కాల్ ఎవరికి చేశారు?
6. తల్లి అంత్యక్రియల రోజు ఇంట్లో జరిగిన గొడవలు ఏమిటి?
7. విజయవాడ ఔటర్ వద్ద ఉన్న ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది?

పది రోజులుగా జయరాం పేరుతో హోటల్లో ఓ గది బుక్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ హోటల్లోనే ఆయన హత్యకు స్కెచ్ వేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.హోటల్లోనే హత్యకు స్కెచ్ వేశారు. అయితే, హైదరాబాదు కేంద్రంగానే ఆయన హత్యకు కుట్ర జరిగినట్లు అనుమానిస్తున్నారు. జనవరి 31వ తేదీన హోటల్లో ఫార్మా కంపెనీ సమావేశం జరిగింది. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఓ తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి జయరాంను తన వెంట తీసుకుని వెళ్లినట్లు భావిస్తున్నారు. అతను మాయమాటలు చెప్పి జయరాంను తన వెంట తీసుకుని వెళ్లి ఉండవచ్చునని అనుకుంటున్నారు. అతని ఆచూకీ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. దస్పల్లా హోటల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మేనకోడళ్లను, అక్కను పోలీసులు ప్రశ్నించారు. జయరాం భార్యాపిల్లలను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. జయరాం గుండెలో మూడు స్టంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జయరాం మృతదేహాన్ని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆయన అంత్యక్రియలు రేపు హైదరాబాదులో జరుగుతాయి. అయితే జయరాం మేనకోడలు శిఖా చౌదరి డ్రైవర్ భార్య పలు విషయాలు వెల్లడించింది. మేడమ్ నిన్న మధ్యాహ్నం నుంచి ఎక్కడున్నారో తెలియడం లేదని చెప్పింది. శిఖా చౌదరి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత కారులో బయటకు వెళ్లినట్లు, ఆ తర్వాత తిరిగి ఇంటికి రానట్లు తెలుస్తోంది. జయరాం శిఖా చౌదరి ఇంటికి వస్తుండేవారని ఆమె డ్రైవర్ భార్య మాటలను బట్టి తెలుస్తోంది. జనవరి 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జయరాం శిఖా చౌదరి ఇంటికి వచ్చాడని, రాత్రి 8 గంటల వరకు ఉన్నాడని చెబుతున్నారు. జయరాం హత్యకు హైదరాబాదులోనే పథకం వేశారని భావిస్తున్న నందిగామ పోలీసులు పది బృందాలుగా విడివడి దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే శిఖా చౌదరిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకొని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ లో ప్రశ్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శిఖా చౌదరి ఇంటికి వచ్చినప్పుడు జయరామ్ తాగి ఉన్నాడని ఆమె డ్రైవర్ భార్య చెబుతోంది. అయితే, ఆయనకు బయట మద్యం సేవించే అలవాటు లేదని ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. జయరాం కారులో ఆయనతో పాటు ముగ్గురు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కారును మరో కారు వెంబడించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కారు వెనక ఉన్న కారు కీసర టోల్ ప్లాజా వద్ద సీసీటీవి ఫుటేజీలో కనిపించింది. జయరాం కారు రాత్రి పది గంటలకు చిల్లకల్లు క్రాస్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన మర్నాడు ఉదయం ఐదు గంటలకు కారులో శవమై కనిపించారు. ఆయన కారు నిలిపి ఉన్న చోటికి చిల్లకల్లు నుంచి 45 నిమిషాల సమయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఆయనను కారులో ఉన్నవారే చంపారా, వెనక వచ్చిన కారులో ఉన్నవారు చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జయరాంను హత్య చేసిన తర్వాత తిరిగి వారు హైదరాబాదు తిరిగి వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయరాం కారులో బీరు సీసాలు, సిగరెట్ పీకలు కనిపించాయి. ఆయనకు మద్యంలో విషం కలిపి తాగించి ఉంటారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఆయనను హత్య చేసిన తర్వాత కారును వదిలేసి ఉంటారా అనేది కూడా తెలియడం లేదు. కోస్టల్ బ్యాంక్ షేర్ల బదలాయింపు పై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, జయరాం మిత్రుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో కీలకంగా మారిన జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు శనివారం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జయరాం హత్యకి శిఖా చౌదరి హస్తం ఉందనే అనుమానంతో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. జయరాం హత్య జరిగిన తర్వాత నుంచి శిఖా చౌదరి కనిపించకుండా పోయారు. కాగా ఎట్టకేలకు ఆమె ఆచూకీని పోలీసులు కనుక్కొని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో తనని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులకు రాకేష్ తో శిఖా చౌదరికి డబ్బుల విషయంలో విభేదాలు ఉన్నట్లు తెలిసింది. ఎవరీ రాకేష్ అని ఆరా తీయగా కొన్ని విషయాలు వెలుగు చూశాయి. రాకేష్ అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం జయరాం మేనకోడలు శిఖా చౌదరికి రూ.4.5కోట్లు అప్పు ఇచ్చినట్లు సమాచారం. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రాకేష్ తరచూ శిఖా చౌదరి ఇంటి వద్దకు వచ్చి గొడవ పడినట్లు తెలుస్తోంది. కాగా మేనకోడలు ఇవ్వాల్సిన డబ్బును తాను ఇస్తానంటూ జయరాం రాకేష్ కి మాట కూడా ఇచ్చారట. ఈ వ్యవహారం తేలకముందే జయరాం శవమై తేలాడు. కాగా జయరాం హత్యకి, ఈ డబ్బు వ్యవహారానికి ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని ఐతవరం రోడ్డు పక్కన శుక్రవారం తెల్లవారు జామున జయరాం శవమై కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే జయరాం ఇంటి వాచ్ మన్ కీలకమైన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అతను వెల్లడించిన అంశాల ఆధారంగానే జయరాం మేనకోడలు శిఖా చౌదరిని, సోదరి సుశీల చౌదరిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న (శుక్రవారం) ఉదయం 6 గంటలకు శిఖా చౌదరి ఇంటికి వచ్చారని, తాళం చెవులు ఇవ్వాలని తనతో గొడవకు దిగారని జయరాం ఇంటి వాచ్ మన్ వెంకటేష్ చెబుతున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు శిఖా చౌదరి కంగారుగా కనిపించారని అతను ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పాడు. శిఖా చౌదరి వెంట శ్రీకాంత్ అనే యువకుడు కూడా వచ్చినట్లు అతను తెలిపాడు. బ్యాంక్ డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా గాలించారని అతను చెప్పాడు. నందిగామ పోలీసులకు అన్ని విషయాలూ చెప్పినట్లు తెలిపాడు. పోలీసులు శిఖా చౌదరి సోదరి మనీషాను కూడా విచారిస్తున్నట్లు సమాచారం. శిఖా చౌదరి స్నేహితుడు రాకేష్ కు సర్దుబాటు చేయాల్సిన సొమ్ము విషయంలోనే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. జయరామ్‌ మేనకోడలు శిఖాచౌదరి ఈ హత్యలో ప్రధాన పాత్ర పోషించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. జయరామ్ హత్యకు కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల వ్యవహారమై హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

అంతేకాక ఈ కేసులో మరో కోణం బయటపడింది. శిఖాచౌదరి ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని ప్రచారం జరుగుతోంది. జయరామ్ మేనకోడలు శిఖాచౌదరి, రాకేష్ అనే యువకుడిని ప్రేమించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వారి పెళ్లికి శిఖాచౌదరి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న విషయాన్ని జయరామ్ చౌదరి గమనించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాకేష్‌ ని జయరామ్ కలిసి శిఖాచౌదరిని వదిలెయ్యాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో జయరామ్ రాకేష్ కు డబ్బు ఆశచూపినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా శిఖాచౌదరిని వదిలేస్తే రూ3.5 కోట్లు ఇస్తానని రాకేష్ కి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాకేష్ శిఖాచౌదరికి దూరంగా ఉంటున్నాడు. అయితే జయరామ్ ఇస్తానన్న సొమ్ము ఇవ్వకపోవడంతో మళ్లీ ఇద్దరు కలిసినట్లు తెలుస్తోంది. డబ్బు ఇవ్వకపోవడంతోపాటు తమని విడదీసేందుకు జయరామ్ కుట్ర పన్నారన్న అనుమానంతో ఇద్దరూ కలిసి హత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. హత్యకు ముందు జయరామ్ చౌదరి ఇంటికి శిఖాచౌదరి, రాకేష్ ఇద్దరూ వెళ్లినట్లు వాచ్ మన్ చెప్తున్నారు. చనిపోయిన రోజు జయరామ్‌ ఇంటికి శిఖాచౌదరి వచ్చినట్లు వాచ్ మన్ చెప్తున్నారు. వాచ్‌మెన్‌ను బెదిరించి ఇంటితాళాలు తీసుకొని ఇంట్లోకి వెళ్లిందని పోలీసుల విచారణలో వెల్లడించారు. శిఖాచౌదరి కంగారుగా ఉందని ఆమెతోపాటు రాకేష్ ఉన్నట్లు వాచ్ మన్ చెప్తున్నాడు. అయితే రాకేష్ రెడ్డికి శిఖా చౌదరి రూ.4.5 కోట్లు అప్పు పడిందని, ఆ అప్పు తీరుస్తానని చిగురుపాటి జయరాం చెప్పాడని కొందరు అంటున్నారు. జయరాం హత్య కేసు శిఖా చౌదరి, శ్రీకాంత్, రాకేష్ అనే ముగ్గురి చుట్టూ తిరుగుతోంది. జయరాం మరణించాడని తెలిసిన రోజు ఉదయమే శ్రీకాంత్ ను వెంట పెట్టుకుని శిఖా చౌదరి ఆయన ఇంటికి వెళ్లింది. శ్రీకాంత్ శిఖా చౌదరి బాయ్ ఫ్రెండ్ అని వార్తలు వస్తున్నాయి. శిఖా చౌదరికి రాకేష్ రెడ్డితోనూ శ్రీకాంత్ తోనూ ఉన్న సంబంధాలేమిటనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడి తమ్ముడి కుమారుడి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్ ను వెంటపెట్టుకుని శిఖా చౌదరి జయరాం ఇంటికి వెళ్లింది. వారిద్దరు జయరాం ఇంటిలోని బెడ్రూంలో వెతకడం సాగించారు. ఆ సమయంలో కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ ఫోన్ చేసి ఇంట్లోకి ఎవరినీ రానీయవద్దని వాచ్ మన్ కు చెప్పాడు. దీంతో వాచ్ శిఖా చౌదరిని వెనక్కి పంపించినట్లు చెబుతున్నారు. జయరాం ఇంటి తాళాల కోసం శిఖా చౌదరి వాచ్ మన్ తో గొడవ పడినట్లు కూడా చెబుతున్నారు. మొత్తం మీద, జయరాం హత్య కేసులో పలు కోణాలు వెలుగు చూస్తున్నాయి.