సిఎం కేసిఆర్ యదాద్రి పర్యటన

SMTV Desk 2019-02-02 16:55:45  Telangana, Yadadri, KCR

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ సిఎం కేసిఆర్ రేపు యదాద్రి బయల్దేరనున్నారు. ఆయన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోనున్నారు. దాంతో పాటు యదాద్రి కొండ పై జరుగుతున్న ఆలయ విస్తరణ పనులను సమీక్షించనున్నారు. అనంతరం యదాద్రిపై చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సంభందిత అధికారులతో చర్చించనున్నారు. యదాద్రి అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు యాదాద్రిని సందర్శించారు. ఇప్పుడు మరోసారి ఆయన ఆలయ పనులని సందర్శించి దిశా నిర్దేశం చేయనున్నారు.