టాలీవుడ్ రీసెంట్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్

SMTV Desk 2019-02-02 16:29:39  Robo2.O, Naa peru surya naa illu india, Saamy, Vishwaroopam2, Devadas, Nota, Sakshyam, Kalaa, Agnathavasi, Maari2, Tej i love you, Amar akbar anthony, Anthariksham, Sketch, Krishnarjuna yuddam, Nela ticket

హైదరాబాద్, ఫిబ్రవరి 2: భారీ అంచనాలతో తెరకెక్కి ఊహంచని విధంగా నష్టాల్లో కొట్టుకుపోయిన టాప్ టాలీవుడ్ సినిమాలు. ఇవి ప్రస్తుతం ఫ్లాప్ లతో ఉన్న సినిమాలతో పోల్చుకుంటే ఇండియాలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఈ సినిమాలు ఉన్నాయి.

*రోబో 2.O
రోబో 2.O శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 500 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించారు. అయితే 350 కోట్ల షేర్స్ అందుకున్న ఈ సినిమా బయ్యర్స్ కి 100 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిందని సమాచారం.
*నా పేరు సూర్య
నా పేరు సూర్య సునామి సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ పెట్టిన బడ్జెట్ కూడా వెనక్కి రాలేదు. 65 కోట్ల పెట్టుబడికి 53 కోట్లు మాత్రమే వచ్చాయి.
*సామి
మొదట్లో విక్రమ్ సామి స్క్వేర్ పై కూడా అంచనాలు బాగానే పెరిగాయి. అయితే సినిమా 50 కోట్లతో నిర్మించగా 27 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. విక్రమ్ కెరీర్ లో ఇదో పెద్ద డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయింది.
*విశ్వరూపం 2
కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన విశ్వరూపం 2 మొదటి రోజే డిజాస్టర్ టాక్ ను అందుకోవడంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కనీసం 30 కోట్లను అందుకోకపోవడం గమనార్హం.
*దేవదాస్
నాని నాగార్జున నుంచి వచ్చిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ గా వచ్చిన సినిమా దేవదాస్. ఈ సినిమా విడుదల అనంతరం పెద్దగా హంగామా చేయలేకపోయింది. 35 కోట్ల ఈ సినిమా 25 కోట్ల షేర్స్ ను మాత్రమే అందుకుంది.
*నోట
విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్ నోట. తెలుగు తమిళ్ లో 20 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమాకు 12 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎక్కువగా బయ్యర్స్ నష్టపోయారు.
*సాక్ష్యం
బెల్లంకొండ హీరో మార్కెట్ కూడా సెట్ కాలేదు. అలాంటిది అతనిపై 40 కోట్ల పెట్టుబడి పెట్టి సాక్ష్యం సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. కానీ ఆ సినిమా 10 కోట్లను మాత్రమే వెనక్కి తెచ్చింది
*కాలా
కబాలి అనంతరం రజనీకాంత్ - పా రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన కాలా సినిమా బడ్జెట్ 135 కోట్లు.. కానీ సినిమా కేవలం 85 కోట్ల షేర్స్ ని మాత్రమే అందించి డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా ముంచేసింది.
*అజ్ఞాతవాసి
ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లో అజ్ఞాతవాసి కూడా వొకటి. బారి అంచనాల నడుమ గత ఏడాది మొదట్లో వచ్చిన ఈ సినిమా 90కోట్లతో రూపొందగా 57 కోట్ల షేర్స్ మాత్రమే అందాయి.
*మారి 2
మొదటి మారి అంతగా ఆడకపోయినా సీక్వెల్ పై నమ్మకంతో ప్రయోగం చేసిన ధనుష్ మరో డిజాస్టర్ అందుకున్నాడు. మారి 2 బడ్జెట్ 35 కోట్లు కాగా 25 కోట్ల షేర్స్ మాత్రమే వచ్చాయి.
*తేజ్ ఐ లవ్ యు
మెగా అల్లుడు సాయి ధరంతెజ్ 15 కోట్లతో నిర్మించిన తేజ్ ఐ లవ్ యు 10 కోట్ల నష్టాలను మిగిల్చినట్లు టాక్.
*అమర్ అక్బర్ ఆంటోని
శ్రీనువైట్ల - రవితేజ కాంబోలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని 20 కోట్ల బడ్జెట్ లో 13 కోట్ల వరకు నష్టాలను మిగిల్చిందని సమాచారం.
* అంతరిక్షం
15 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించిన అంతరిక్షం సినిమా కనిసం 10 కోట్లు వెనక్కి తీసుకురాలేకపోయింది.
*స్కెచ్
విక్రమ్ నుంచి వచ్చిన మరో సినిమా స్కెచ్ కూడా బాక్స్ ఆఫీస్ ముందు చతికిలపడింది. 30 కోట్ల ఈ సినిమా 20 కోట్లు కూడా వెనక్కి తీసుకురాలేదు.
* కృష్ణార్జున యుద్ధం
వరుస విజయాలతో ఉన్న నానిని కృష్ణార్జున యుద్ధం గట్టిదెబ్బే కొట్టింది. బడ్జెట్ 25 కోట్లైతే 15 కోట్లు తేవడానికి ఈ సినిమా నన తంటాలు పడింది.
*నెల టికెట్టు
25 కోట్లతో తెరకెక్కిన నెల టికెట్టు రవితేజ మార్కెట్ కి తగ్గట్టు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కేవలం 10 కోట్లు మాత్రమే వచ్చాయి.