వాద్రాకు తాత్కాలిక బెయిల్

SMTV Desk 2019-02-02 15:15:14  Robert Vadra, Rahul Gandhi, Priyanka Gandhi, Temporary Bail

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రముఖ పారిశ్రామిక వేత్త రాబర్డ్ వాద్రా, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ భర్త. వాద్రాకు మనీ లాండరింగ్ కేసులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన్ను ఫిబ్రవరి 16 వరకు అరెస్టు చేయకుండా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వాద్రా తరఫు న్యాయవాది కేటీ తులసి, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తన క్లయింట్‌పై రాజకీయ ప్రతీకారానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు తెలిపారు.

ఇప్పటికే వాద్రాకు రాజస్థాన్ హైకోర్టు ఇన్‌టర్మ్ రిలీఫ్ ఇచ్చింది. వాద్రా సంబంధించిన బ్యాంకు అకౌంట్లు, స్థలాల వివరాలను కూడా గతంలోనే కోర్టుకు సమర్పించామని వాద్ర తరఫు న్యాయవాది చెప్పారు. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ రాబర్ట్ వాద్రా కోర్టును ఆశ్రయించారు. వాద్రా చట్టాన్ని గౌరవించే పౌరుడనని, తప్పుడు ప్రాసిక్యూషన్‌కు తనను టార్గెట్ చేస్తున్నారని ఆయన కోర్టుకు విన్నవించారు. లండన్‌కు చెందిన ఆస్తి కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలను వాద్రా ఎదుర్కొంటున్నారు.