అప్పుల్లో అనిల్ అంబానీ, తన ఆస్తులు అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయం

SMTV Desk 2019-02-02 14:54:03  Anil Ambani, Reliance, Reliance Jio, Brook Field, State Bank of India, China development, Union Bank, Canara Bank, IDBI Bank, Standard Charter Bank, HDFC Bank

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: రిలయన్స్ కామ్ సంస్థ అధినేత అనిల్ అంబానీ. ఇప్పుడు ఆ సంస్థ కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక తన ఆస్తులను అమ్మి రూ.42వేల కోట్లు చెల్లించాలని అనిల్ అంబానీ భావిస్తున్నారు. గత సంవత్సరంలోగా చెల్లిస్తానని చెప్పి చెల్లించకపోవడంతో అనిల్ అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత సంవత్సరంలో అప్పులు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించలేకపోయినట్లు, ఈ ఏడాది ఆ రుణాలను తీర్చుతానని, అదికూడా 270 రోజుల్లో చెల్లిస్తానని అనిల్ అంబానీ చెబుతున్నారు. ఇందుకోసం ఆస్తులను అమ్మకాలకు పెట్టినట్లు ఆర్‌కాం బోర్డు వొక ప్రకటనలో తెలిపింది. అంతేకాక పలు న్యాయపరమైన సమస్యలు రావడం తో ఆర్‌కాంకు సంబంధించి రూ.18వేల కోట్లు ఆస్తులను అమ్మలేకపోతోందని తెలిపింది. అప్పుడు ఇచ్చిన వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చైనా డెవలప్‌మెంట్, యూనియన్ బ్యాంక్, కెనారా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, స్టాండర్డ్ ఛాటర్డ్ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ బ్యాంకులు ఉన్నాయని తెలిపింది.

రుణాలు చెల్లించేందుకు ఇప్పుడు ఆర్‌కాం సంస్థ ముందుగా 122.4 మెగా హెడ్జ్ స్పెక్ట్రం, మరియు 43వేల టెలికాం టవర్స్‌ను రిలయన్స్‌ సంస్థ జియోకు , కొంత రియల్ ఎస్టేట్ కెనడాకు చెందిన బ్రుక్‌ఫీల్డ్ సంస్థకు అమ్మాలని భావిస్తుంది. ఇందుకోసం కోర్టును సంప్రదించాలని ఇప్పుడు ఆ యోచన విరమించుకుంది. అయితే ఇప్పటికే నోడ్స్, మరియు ఫైబర్‌ రూ. 5వేల కోట్లకు అమ్మివేసింది. ఇక కోర్టు కంపెనీ సమస్యను పరిష్కరించి అది కొద్ది రోజుల పాటు పనిచేసేలా కొందరి నిపుణులను అపాయింట్ చేస్తుంది. అంతేకాదు ఆస్తులు అమ్మేందుకు జరిగే బిడ్డింగ్‌ను వీరు పరిశీలించి మిగతా ఆస్తులు 270 రోజుల్లో అమ్ముడుపోయేలా చర్యలు తీసుకుంటారు.