నగరంలో కేంద్ర ఆర్థిక సంఘం పర్యటన

SMTV Desk 2019-02-02 14:39:03  central finance commission, Hyderabad, KCR, Kaleshwaram Project, Mission Bhageeratha, Assembly meeting, Vote on Account budget

హైదరాబాద్, ఫిబ్రవరి 2: కేంద్ర ఆర్థిక సంఘం ఈ నెల 18 న తెలంగాణకు రానుంది. ఈ సంఘం రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించనుంది. ఇందులో భాగంగా 18, 19 తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మరికొందరు ఉన్నతాధికారులతో జూబ్లీ హాల్‌లో ఈ సంఘం భేటీ కానుంది. 20న క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులను ఆర్థిక సంఘం సందర్శించనున్నది. ఈ పర్యటన నేపథ్యం లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను 20వ తేదీ తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాలలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు.