రూల్స్ పాటించని మేయర్...జరిమానా విధించిన పోలీసులు

SMTV Desk 2019-02-02 12:53:57  Bonthu Rammohan, cyberabad police, Telangana DGP, GHMC

హైదరాబాద్, ఫిబ్రవరి 2: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ట్రాఫిక్ నిభందనలను ఉల్లంఘించారు. నో పార్కింగ్ జోన్ లో కారును పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ పోలీసులు ఆయనకు జరిమానా విధించారు. గురువారం మధ్యాహ్నం మేయర్ బొంతు రామ్మోహన్ ఏపీ09 సీ9969 నెంబర్ గల వాహనంలో మాదాపూర్ వెళ్లారు. అక్కడ ఇనర్బిట్ మాల్ సమీపంలోని ఐ ల్యాబ్ వద్ద మధ్యాహ్నం 12గంటల 55నిమిషాలకు నో పార్కింగ్ జోన్ లో ఆయన తన కారును పార్క్ చేశారు. ఇది గమనించిన వొక నెటిజెన్ ఆ కారుని మొబైల్ లో ఫోటో తీసి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, తెలంగాణా డిజిపికి పంపి ట్విట్టర్ లో ఫిర్యాదు చేసాడు.

దీనికి స్పందించిన సైబరాబాద్ పోలీసులు ఆ ఫోటోని ట్రాఫిక్ విభాగానికి పంపించారు. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మేయర్ వాహనానికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిభంధనలను పాటించడంలో మెరుగుపడుతున్న నెటిజన్లను ట్రాఫిక్ పోలీసులు అభినందించారు.