భారత ప్రభుత్వ తీరుపై విజయ్ మాల్యా ఫైర్ : న్యాయం ఎక్కడుంది అంటూ ట్వీట్

SMTV Desk 2019-02-02 12:40:03  Vijay mallya, Indian Government, Assets attached, Twitter

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: బ్యాంకుల నుండి వేల కోట్లు రుణాలుగా తీసుకొని ఎగ్గొట్టి పరారిలో ఉన్న ఆర్ధిక నేరస్తుడు విజయ్ మాల్ల్యా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తన గ్రూపు కంపెనీల ఆస్తులను జప్తు చేయడంపై విజయ్ మల్ల్యా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వడ్డీలతో కలిపి తాను చెల్లించాల్సింది రూ.9,000 కోట్లు అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తో సహా భారత అధికారులు తన గ్రూపు కంపెనీలకు చెందిన రూ.13,000 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు ట్వీట్‌ చేశారు. అధికారులు ఇప్పటి వరకు రూ.13,000 కోట్ల విలువైన మా గ్రూపు కంపెనీల ఆస్తులు జప్తు చేశారు.

అయినా ప్రభుత్వ రంగ బ్యాంకులకు నేను రూ.9,000 కోట్లు ఎగవేసి పారిపోయానని చెబుతున్నారు. న్యాయం ఎక్కడుంది. ఇది సరైన చర్యేనా అని ట్వీట్‌ చేశారు. తన నుంచి రుణాల వసూలు పేరుతో భారతీయ బ్యాంకులు లాయర్ల ఖర్చుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్నీ మాల్యా తప్పు పట్టారు. ఇందుకు ఎవరు జవాబుదారీ అని ప్రశ్నించారు. ఇవే బ్యాంకుల లాయర్లు, బ్రిటన్‌లో తన లాయర్ల కోసం ఖర్చు చేస్తున్న ఫీజులను ప్రశ్నించడాన్నీ మాల్యా తప్పు పట్టారు.