మధ్యంతర బడ్జెట్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

SMTV Desk 2019-02-02 12:15:46  Union budget meeting 2019, Piyush goyel, Central government, Central financial minister, Supreme court, Petition

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఈ బడ్జెట్‌ పై మనోహర్‌లాల్‌ శర్మ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

రాజ్యాంగ నిబంధనకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. అసలు రాజ్యాంగంలో ఖతాత్కాలిక బడ్జెట్‌గ అన్న ప్రస్తావనే లేదని, అటువంటప్పుడు తాత్కాలిక బడ్జెట్‌ ఎలా ప్రవేశపెడతారని పిటిషనర్‌ తన పిటిషన్‌లో వాదించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.