చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు

SMTV Desk 2019-02-01 18:42:12  Andhra Pradesh, Special Status, Kanna Lakshmi Narayana

అమరావతి, ఫిబ్రవరి 1: ఆంధ్రప్రదేశ్ లో టీడిపీ, బీజేపీల మధ్య మతాల యుద్ధం జరుగుతుంది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు "బీజేపి నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.. కేంద్ర సంస్థలు ఎవరి కోసం ఇస్తాయి, ఎవరి సొమ్ము ఇస్తున్నాయి? మీ మాటలు వింటుంటే రక్తం ఉడికిపోతుంది" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యంగ్యంగా స్పందించారు.

కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ లో ఆదాయపన్ను పరిధి పెంచడం, ఏపీ అసెంబ్లీలో బీజేపీ నాయకులపై చంద్రబాబు బీపీ పెరగడం చూస్తుంటే ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందేమో అనిపించిందని అన్నారు. ఆదాయపన్ను పెరుగుదల దేశానికి, సామాన్యులకు మేలు చేస్తుందని, చంద్రబాబు బీపీ పెరగడం ఆయన ఆరోగ్యానికి హానికరమని కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేసారు.