'భారతీయుడు 2' షూట్ టూ లేట్...

SMTV Desk 2019-02-01 17:28:50  Bharatheeyudu 2, Kamal hasan, Director shankar, Kajal agarwal, Shoot delay

హైదరాబాద్, ఫిబ్రవరి 1: సంచలన దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కంనినేషణ్ లో వస్తున్న చిత్రం భారతీయుడు 2 . జనవరి థర్డ్ వీక్ షూటింగ్ పొల్లాచ్చిలో ప్రారంభమైంది. ఐతే, కొద్దిరోజులకే నిలివేశారని సమాచారం. సెట్‌కి సంబంధించిన పనులు పూర్తి కాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ లేదా సెకండ్ వీక్ నుంచి చిత్రీకరణ మొదలుకావచ్చని అంటున్నారు.

కమల్‌హాసన్‌ పక్కన హీరోయిన్‌గా కాజల్ నటించనుంది. దుల్కర్‌ సల్మాన్‌, అజయ్‌ దేవ్‌గన్ కీలకపాత్రలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకి కొద్దిగా కొరియన్ టచ్ ఇవ్వాలని ఆలోచన చేసిన శంకర్, కొరియన్ భామ సూజీ బేని తీసుకున్నాడు. కొంత షూట్ తైవాన్‌లో జరగనుంది. భారతీయుడు లో సీబీఐ ఆఫీసర్‌ పాత్రనే సీక్వెల్‌లోనూ నెడుముడి వేణు పోషించనున్నాడు.