డ్రైవర్ లేని రైలు, పది కిలోమీటర్ ల పరుగు

SMTV Desk 2017-06-01 13:00:47  trains,passengers

చెన్నై, జూన్ 1 : తమిళనాడు లోని తిరుచ్చి రైల్వే జంక్షన్ లో ఈ ఘటన జరిగింది. రైల్లో డ్రైవర్ లేకుండానే 10 కిలో మీటర్ల వరకు వెళ్ళింది. మరమ్మతులకు గురైన ఒక రైలింజన్ ను తిరుచ్చి నుంచి ఈరోడుకు తిసుకేల్లెందుకు అధికారులు బుధవారం ఏర్పాట్లు చేసారు. ఉదయం 6.40 నిమిషాలకు రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ఫ్లాట్ ఫారం పై నుంచి మరొక ఇంజన్ తో జోడించి తిసుకేల్లెందుకు ప్రయత్నాలు చేసారు. ఐతే పాడైన రైలు అకస్మాత్తుగా ముందుకు కదులుతుంది. దీంతో ఇంజన్ డ్రైవర్ షాక్ కి గురై సంబంధిత అధికారులకు సమాచారం చేరవేశారు. ఆ రైలు ఫోర్ట్ రైల్వేస్టేషన్ వరకు వెళ్ళింది. అక్కడ ఆ ఇంజన్ ను నిలిపివేసేందుకు ప్రయత్నాలు చేసారు కానీ ఫలించలేదు. దీంతో ఆ రైలు కరూర్ బైపాస్ వంతెన దాటి ముత్తరసనల్లుర్ వైపు వెళ్తుండగా అక్కడ ఉన్న లూప్ లైన్ కు మళ్ళించడం తో ఆ రైలు నిలిచి పొయింది. ఆ రైల్లో డ్రైవర్ లేకుండా పది కిలోమీటర్ల వరకు వెళ్ళింది. దీని గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ కొందరు రైలు డ్రైవర్ దాన్ని స్టార్ట్ చేసి కిందకు దిగాడు. అయితే అకస్మాత్తుగా అది ముందకు వెళ్తూ అల 10 కిలోమీటర్ల వరకు వెళ్లిందని చెబుతున్నారు.