కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో విషాదం

SMTV Desk 2019-02-01 17:03:18  Comedian Srinivas reddy, Fathers Death, Jayammu nischayammura

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తనని అల్లారు ముద్దుగా పెంచి పోషించి తెలుగు ఇండస్ట్రీ కి వొక మంచి కమిడియన్ ని అందించించిన శ్రీనివాస్ రెడ్డి తండ్రి రామిరెడ్డి (82) మృతి చెందాడు. గత కొన్ని రోజులగా అనారోగ్యంతో బాద పడుతున్న అయన ఆదివారం కన్నుమూసారు.

దీంతో శ్రీనివాస్ రెడ్డి కుటుంబం శోక సంద్రంలో మునిగి పోయింది. రామిరెడ్డి కూడా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందాడు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ప్రొడ్యూసర్ బి ఏ రాజు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలోని వో పాత్రలో రామిరెడ్డి నటించారు.