వ‌చ్చే ఏడాది సంక్రాంతికి `సోగ్గాడే చిన్ని నాయ‌నా` సీక్వెల్

SMTV Desk 2019-02-01 16:43:43  Akkineni nagarjuna, Soggade chinni nayana, Akkineni Naga chaithanya, Director kalyan krishna

హైదరాబాద్, ఫిబ్రవరి 1: అక్కినేని నాగార్జున డ్యూయేల్ రోల్ లో చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా నాగ్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. 2016 లో వచ్చిన ఈ సినిమా కు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా అక్కినేని నాగార్జున తన సొంత బ్యానర్ లో నిర్మించారు. అయితే మ‌ళ్ళీ మూడేళ్ళ త‌రువాత ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కుతోంది. వొరిజ‌న‌ల్ వెర్ష‌న్‌ని తెర‌కెక్కించిన క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోనే ఈ సీక్వెల్ తెర‌కెక్క‌నుండ‌గా ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఆయ‌న త‌న‌యుడు, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కూడా న‌టించ‌నున్నాడు. బంగార్రాజుకి మ‌న‌వ‌డిగా, రాముకి కొడుకుగా ఈ పాత్ర ఉంటుంద‌ని టాక్‌.

ఇదిలా ఉంటే జూన్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగనుంది. వేగ‌వంతంగా చిత్రీక‌ర‌ణ కార్య‌క్ర‌మాలు జ‌రిపి వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. మ‌రి సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌లైన `సోగ్గాడే చిన్ని నాయ‌నా` త‌ర‌హాలోనే అదే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని విడుద‌ల కానున్న ఈ సీక్వెల్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తుందేమో చూడాలి.