ఇది జస్ట్ ట్రైలర్‌ మాత్రమే: ప్రధాని

SMTV Desk 2019-02-01 16:33:07  Narendra Modi, Piyush Goyal, Union Budget Meeting

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: నేడు జగుతున్న బడ్జెట్‌ సమావేశాలు అందరిని ఆకట్టుకునేల ఉన్నాయని, రైతులు, మధ్యతరగతి వేతన జీవులు సహా అందరి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమేనని లోక్ సభ ఎన్నికల తరువాత దేశం అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది అని తెలిపారు. పార్లమెంట్‌లో పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం మోదీ మాట్లాడుతూ బడ్జెట్‌లో పలు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చేశామన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మధ్యంతర బడ్జెట్‌ ప్రజలను ఆకట్టుకునేల ఉంది. పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులు, వేతన జీవులకు ఊరట ఇచ్చే చర్యలు చేపట్టారు. 5 ఎకరాల్లోపు రైతులకు ఏడాదికి రూ 6000 పెట్టుబడి సాయంగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు. ఇక మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు భారీ ఊరటగా ఆదాయపన్నుమినహాయింపు పరిమితిని రూ 5 లక్షలకు పెంచారు. అయిదు లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు.