వరుణ్ సరసన తమిళ్ డబ్ స్మాష్ బ్యూటి

SMTV Desk 2019-02-01 16:00:09  Varun tej, F2, Valmiki, Harish shanker, Valmiki sanghalu, Valmiki title, Sree vishnu, Mrinialini ravi, Tamil dubsmash

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఎఫ్ 2 తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్‌ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ నటించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో కూడా వరుణ్ తేజ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ రీమేక్‌లో వరుణ్ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న బాబి సింహా పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు చేస్తున్నారని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వినిపిస్తుంది. ఈసినిమాలో వరుణ్ తేజ్ సరసన డబ్ స్మాష్ బ్యూటీ నటించనున్నట్టు తెలుస్తోంది. తమిళ్ లో డబ్ స్మాష్ లతో ఫేమస్ అయిన మృణాలిని రవి అనే అమ్మాయి ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన నటించనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారింగా ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. కాగా 14 రీల్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.