ఐఐటీ హైదరాబాద్ లో విషాదం...!

SMTV Desk 2019-02-01 15:10:12  IIT Hyderabad, Thirumalagiri, B Tech student death

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి క్యాంపస్‌లోని ఏడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. మృతుడు తిరుమలగిరికి చెందిన ఎం అనిరుధ్య గా గుర్తించారు. విద్యార్థి ఐఐటీలో మెకానికల్‌ ఏరోస్పేస్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈ సంఘటన రాత్రి 12 గంటలకు జరిగినట్లు సమాచారం.