'వాల్మీకి' హీరో...!

SMTV Desk 2019-02-01 13:35:47  Varun tej, F2, Valmiki, Harish shanker, Valmiki sanghalu, Valmiki title, Sree vishnu

హైదరాబాద్, ఫిబ్రవరి 1: వరుణ్ తేజ్ ఎఫ్2 తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' అనే టైటిల్ తో వో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం తమిళ సూపర్‌హిట్ మూవీ ‘జిగర్తాండ’కి రీమేక్. తమిళ్‌లో బాంబీ సింహా, సిద్దార్థ్‌లు ముఖ్య పాత్రలు పోషించగా.. ఈ రీమేక్‌లో బాబీ సింహా పాత్రను వరుణ్‌ తేజ్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో సిద్దార్ద పాత్రను ఎవరు పోషించబోతున్నారనే విషయం హాట్ టాపిక్ మారింది. మొదట నాగశౌర్య ను ఈ పాత్ర కోసం అడుగుదామనుకున్నారట.

అయితే ఇప్పుడు శ్రీ విష్ణును ఆ క్యారక్టర్ కు వొప్పిస్తున్నట్లు సమాచారం. కథా పరంగా శ్రీవిష్ణు ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. అంటే వరుణ్ తేజ విలన్, శ్రీవిష్ణు హీరో అన్నమాట. ఈ మధ్యే పూజా కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్‌ మిగతా నటీనటులను ఎంపిక చేసే పనుల్లో ఉన్నట్లు సమాచారం. వరుణ్‌ తేజ్‌ చేస్తున్న నెగెటివ్‌ పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ తిరగనుంది‌. దబాంగ్‌ను ‘గబ్బర్‌సింగ్‌’గా రీమేక్‌ చేసి సంచలనం సృష్టించిన హరీష్‌ శంకర్‌ ‘వాల్మీకి’ని తెరకెక్కిస్తూండటంతో మార్కెట్లోనూ చిన్నపాటి క్రేజ్ క్రియేట్ అయ్యింది.