యువకుడిని రేప్ చేసిన యువకుడు

SMTV Desk 2017-08-01 15:28:03   Rape, Teenager, karnataka, maisur, mani, rachappa,Investigation of the police

కర్ణాటక, ఆగస్టు 1 : నేటి సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా చేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇటీవల మైసూరు జిల్లాలోని హెచ్‌.డి.కోటకి చెందిన సంజనయ్య కాలనీ లో నివాసం ఉంటున్న మణి అనే వ్యక్తి దురలవాట్లకు బానిసయ్యాడు. గత ఐదు రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన రాచప్ప అనే యువకుడికి కూలీ పని ఇప్పిస్తానని నమ్మించి, వేరే ప్రాంతానికి తీసుకెళ్లి, అతనిపై లైంగిక దాడి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తీవ్ర వేదన అనుభవించిన రాచప్ప, అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స చేసిన వైద్యులు విషయం గుర్తించి రాచప్ప తల్లికి విషయాన్ని తెలిపారు. దీంతో నిర్ఘాంత పోయిన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.