టీడీపీ గెలవడం కష్టమే..!

SMTV Desk 2019-02-01 13:10:21  Andhra Pradesh Assembly elections, TSRCP, TDP, Congress, Pawan Kalyan Janasena, Times Now survey

ఆంధ్ర ప్రదేశ్, ఫిబ్రవరి 1: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఎన్నికల సర్వేలు మొదలయ్యాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వొకేసారి జరుగుతుండడంతో రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ లోక్‌సభ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీనే గెలుస్తుందని నొక్కి చెబుతున్నాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా టీడీపీ ఈసారి గెలవడం కష్టమేనని, వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని తేల్చింది.

ఆంధ్ర ప్రదేశ్ లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. అయితే టైమ్స్ నౌ సర్వే ప్రకారం వైఎస్సాఆర్‌సీపీకి 23 సీట్లు సంపాదిస్తుంది. టీడీపీకి 2 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. ఎంపీ సీట్లలో 23 వైఎస్సాఆర్‌సీపీకి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. వైసీపీ దాదాపు 140 సీట్లకు పైగా గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఉన్న 175 సీట్లలో 140 దాకా వైసీపీకే వస్తే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ జనసేన పరిస్థితి ఏంటని చర్చలు జరుగుతున్నాయి.