'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో హరికృష్ణే విలన్...?

SMTV Desk 2019-02-01 12:03:04  Lakshmis NTR, NTR Mahanayakudu, Ram gopal varma, Krish jagarlamudi, Nandamuri harikrishna, NTR

హైదరాబాద్, ఫిబ్రవరి 1: నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను ఇద్దరు సంచలన దర్శకులు క్రిష్, రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే క్రిష్ ఈ సినిమాను రెండు భాగాలుగా చేసి అందులో మొదటి పార్ట్ ఇప్పటికే విడుదలయ్యి రెండవ పార్ట్ విడుదల కావడానికి రంగం సిద్దం చేస్తున్నాడు. ఈ సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రను పాజిటివ్ యాంగిల్ లోనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఎప్పుడూ తోడుగా ఉండే హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో మాత్రం హరికృష్ణను విలన్ గా చూపించబోతున్నారని టాక్. దర్శకుడు వర్మ రూపొందిస్తోన్న ఈ సినిమాని ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా విడుదల ఆపడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.

కానీ వర్మ మాత్రం సైలెంట్ గా తన పని కానిచ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ అసలైన బయోపిక్ ఇదేనని వర్మ చెబుతున్నప్పటికీ సినిమా మొత్తం లక్ష్మీపార్వతి చుట్టూ తిరగనుంది. ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్న తరువాత ఎన్టీఆర్ కుటుంబం అతడికి దూరమైంది. పార్టీ వ్యవహారాల్లో, కుటుంబ విషయాలకు సంబంధించి లక్ష్మీపార్వతి జోక్యం చేసుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ, అతడి కుమారులు లక్ష్మీపార్వతిపై ఆగ్రహాన్ని ప్రదర్శించేవారట. ముఖ్యంగా హరికృష్ణ చాలాసార్లు లక్ష్మీపార్వతికి వార్నింగ్ ఇచ్చారట. ఆ సన్నివేశాలను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో చూపించబోతున్నారని సమాచారం.