అఖిల్ తో టాప్ డైరెక్టర్...

SMTV Desk 2019-02-01 11:47:24  Akkineni nagarjuna, Akkineni Akhil, Mr Majnu, Krish jagarlamudi

హైదరాబాద్, ఫిబ్రవరి 1: వరుస ఫ్లాప్ లతో దూసుకెళ్తున్న యువ హీరో అక్కినేని అఖిల్ పై తండ్రి అక్కినేని నాగర్జున ఆలోచనలో పడ్డాడు. రీసెంట్ గా వచ్చిన మిస్టర్ మజ్ను ఊహిచంచని హిట్ అందుకోకపోయేసరికి హట్రిక్ ఫ్లాప్ కొట్టాడు అఖిల్. అయితే నాగార్జున తన కుమారుడుకి సక్సెస్ ఇచ్చే దర్శకుడి కోసం వేట మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శ్రీనువైట్ల, పూరి జగన్నాథ్ వంటి దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ నాగార్జున మాత్రం దర్శకుడు క్రిష్ ని లాక్ చేసినట్లు సమాచారం. దర్శకుడిగా క్రిష్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

అంతేకాక క్రిష్ సినిమాల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ కారణంగానే క్రిష్ తో అఖిల్ సినిమా చేస్తే బాగుంటుందని నాగార్జున అనుకుంటున్నాడు. క్రిష్ దగ్గర కూడా కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం క్రిష్.. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా విడుదలైన తరువాత అఖిల్ తో సెట్స్ పైకి వెళ్తాడని చెబుతున్నారు. మరి క్రిష్ అయినా అఖిల్ కి సక్సెస్ ఇస్తాడేమో చూడాలి!