పేదలకు కనీస ఆదాయం: యూబీఐ

SMTV Desk 2019-02-01 11:43:59  Union Basin Income, Budget meeting, Piyush Goyal

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: పేద, మధ్య తరగతి కుటుంబాలకు శుభ వార్త. ప్రతినెలా కనీస ఆదాయం కల్పించేలా మోడీ ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈరోజు(ఫిబ్రవరి1వ తేదీ) పార్లమెంట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల తరువాత సమావేశమయ్యే కేంద్ర క్యాబినెట్ 2019-20 సంవత్సరానికి గాను ఈ ఉదయం పార్లమెంట్ ముందుకు రానున్న బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం పలికింది. ఆర్థిక శాఖ బాధ్యతలు తన భుజానికి ఎత్తుకున్న పీయుష్ గోయల్, సంప్రదాయ ఎరుపు రంగు సూట్ కేసును పట్టుకుని పార్లమెంట్ చేరుకున్నారు. ఈ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలపై వరాల జల్లు కురిపించే అవాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా పేదల కోసం సార్వత్రిక ప్రాథమిక ఆదాయం పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. 2016-17 ఆర్థిక సర్వేలోనే ప్రభుత్వం యూనియన్ బేసిన్ ఇన్కమ్(యూబీఐ) గురించి ప్రస్తావించారు. అన్ని రాయితీలను కలిపి నగదు రూపంలో పేదలకు ఇవ్వాలనే ఆలోచనలో కేంద్రం ప్రభుత్వం ఉంది. కానీ ఈ ఆలోచనలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ ఇబ్బందుల వల్ల ప్రస్తుతానికి ఆ విధానంలో కాకుండా పాక్షిక సార్వత్రిక ప్రాథమిక ఆదాయ పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ పతకాన్ని పేదలందరికీ కాకుండా నిరుపేదలుగా తేలిన 40శాతం మందికి మాత్రమే వర్తించే అవకాశం ఉంది. వారికి నెలకు రూ.700 నుండి రూ.1200 వరకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ పథకం కింద ప్రభుత్వానికి రూ.1లక్ష కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.