'గౌతం నంద' కాంబో రిపీట్...!

SMTV Desk 2019-02-01 10:59:44  Director Sampath nandi, Gopichand, Producer Radhakrishna, Goutham nanda, Bengal tiger, Rachha

హైదరాబాద్, ఫిబ్రవరి 1: రచ్చ , బెంగాల్ టైగర్ , గౌతం నంద వాటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంపత్ నందికి సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. అయితే గోపీచంద్ తో తీసిన గౌతం నంద సినిమా ఊహించని హిట్ అందుకోకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు ఈ దర్శకుడు. అయితే ఈయన సినిమాల ఫ్లాప్ లకు కారణం తనేనట. బేసిక్ గా రైటర్ అయిన సంపత్ స్క్రిప్ట్స్ విషయంలో కాస్త తడబడ్డాడు అని సినీ వర్గాల్లో టాక్. అయితే ఇప్పుడు గౌతం నంద హీరో గోపీచంద్, బెంగాల్ టైగెర్ నిర్మాత రాధామోహన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు అని సమాచారం. అందుతున్న సమాచారం మేరకు రీసెంట్ గా గోపిచంద్ ని కలిసి ఫైనల్ నరేషన్ ఇచ్చాడు ఈ దర్శకుడు.

విన్న వెంటనే గోపిచంద్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ఇచ్చాడట. ఈ చిత్రం మే లో సెట్స్ మీదకు వెళ్లనుంది. గోపీచంద్ కు కూడా ఇటీవల సరైన హిట్ లేదు. దీనితో వీరిద్దరూ ఎలాగైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క గోపిచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తన 26వ చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాను ఇటీవలే లాంచ్ చేశారు. టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో గోపీచంద్ పెరిగిన గెడ్డంతో కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఆ లుక్ కి సంబంధించిన స్టిల్ వొకటి బయటికి వచ్చింది. నిజంగానే ఈ లుక్ లో గోపీచంద్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.