ఐటమ్ సాంగ్ తో రానున్న కేథరిన్

SMTV Desk 2017-08-01 14:59:23  KATHAREEN ITEM SONG IN JAYA JAANAKI NAAYAKA.

హైదరాబాద్, ఆగష్టు 1: తెలుగులో "పైసా", "ఇద్దరమ్మాయిలతో", "సరైనోడు" వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తార కేథరిన్. సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే గా ప్రేక్షకుల మనసు దోచుకుంది. తాజాగా కేథరిన్ "జయ జానకి నాయక" చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఆమె చేసిన ఐటం సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి యూత్ నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. "ఏ ఫర్ యాపిలూ .." అంటూ సాగే ఈ సాంగ్ లో కేథరిన్ హాట్ లుక్ తో రెచ్చిపోయింది. ఆమె అందానికి, ఆమె వేసిన స్టెప్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకి ఈ సాంగ్ హైలెట్ గా నిలుస్తుందంటున్నారు. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.