అనుమానాస్పద స్థితిలో విద్యార్దిని మృతి...!

SMTV Desk 2019-01-31 18:25:48  Kareem Nagar, Collage Student Death

కరీంనగర్, జనవరి 31: కరీంనగర్ జిల్లలో విద్యార్దిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ ఘటనా స్థానికంగా కలకలం సృష్టించింది. కరీంనగర్ లోని అల్పోర్స్‌ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న రుచిత అనే విద్యార్థిని కాలిన గాయాలతో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ కళాశాల అధికారులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే అమెది ఆత్మహత్య కాదని హత్యేనని తోటి విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

రుచిత మృతి పై కళాశాల యాజమాన్యం పై పలు అనుమానాలు వ్యక్తముతున్నాయి. కళాశాల యాజమాన్యం గాయాలతో ఉన్న ఆమెను గట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించారని, ఆమె మరణం వెనుక వున్న కారణంపై విచారణ జరపాలంటూ విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే గతంలోనూ ఈ కళాశాలలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు.