అనుకుంది ఒకటి...అయ్యింది ఒకటి

SMTV Desk 2019-01-31 17:38:23  Akkineni nagarjuna, Akkineni Akhil, Mr Majnu

హైదరాబాద్, జనవరి 31: Mr మజ్ను సినిమాపై భారీ ఆశలు పెట్టుకున తండ్రి కొడుకులకు సినిమా రిసల్ట్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు నాగార్జున. తన కుమారుడు అఖిల్ కి కచ్చితంగా హిట్ వస్తుందని కొడుకుతో కలిసి కొన్ని టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో నాగార్జున.. ఈ వారంలో గోవా వెళ్తున్నట్లు రెండు, మూడు వారాలు అక్కడే రిలాక్స్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. మిస్టర్ మజ్ను సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అక్కడ జరుపుకుంటామని నమ్మకంగా చెప్పాడు. అఖిల్ కూడా సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

అన్ని అంశాలు కలగలిపిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పాడు. కానీ సినిమా రిజల్ట్ ఊహించినట్లుగా రాలేదు. మూడు వరుస ఫ్లాప్ లతో అఖిల్ క్రేజ్ బాగా దెబ్బ తింది. కనీసం ఎవరేజ్ గ్రాసర్ సినిమా అయినా పడకపోతే హీరోగా అఖిల్ నిలబడడం చాలా కష్టం. ఈ విషయం నాగార్జున ఆందోళనకి గురి చేస్తోంది. కొడుకు కెరీర్ ని ఎలాగైనా నిలబెట్టాలని తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గోవాలో తన హాలిడే ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. మరి నాగార్జున కోరుకుంటున్నట్లుగా అఖిల్ హీరోగా ఎప్పుడు సక్సెస్ అందుకుంటాడో చూడాలి!