మహేష్ బాబు న్యూ వెబ్ సిరీస్ 'చార్లీ'...!

SMTV Desk 2019-01-31 17:13:23  Tollywood, Mahesh babu, Namratha, Web series, Short films, Top digital companys, Charlie, Jio

హైదరాబాద్, జనవరి 31: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని టాప్ డిజిటిల్ కంపెనీలకు వెబ్ సిరీస్ లు అందించేందుకు సిద్దమవుతున్నాడని సినీ వర్గాలు గత కొంత కాలంగా చెప్పుకుంటున్నాయి. అలాగే కంటెంట్ ప్రధానంగా సాగే చిన్న సినిమాలు నిర్మించి డిజిటిల్ ప్రపంచానికి అందిస్తామని చెప్పినట్టు సమాచారం. దాంతో మహేష్ కు ,నమ్రతకు పరిచయం ఉన్న చాలా మంది దర్శకులు కలిసి తమ ప్రపోజల్స్ పెడుతున్నారట. అయితే ఈ నేపధ్యంలో ఆయన మొదటగా వెబ్ సీరిస్ ని స్టార్ట్ చేస్తున్నారని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం తొలి వెబ్ సీరిస్ డిటిక్టెవ్ కథ నేపధ్యంలో సాగుతుంది. మాకు మేమే మీకు మీరే, నాన్నకు ప్రేమతో చిత్రాలతో పరిచయమైన హుస్సేన్ షా కిరణ్ డైరక్ట్ చేయనున్నారు. ఈ మేరకు బాలీవుడ్ మ్యాగజైన్ డిఎన్ ఎ ఓ కథనం ప్రచురించింది.

ఇక ఈ సీరిస్ కు టైటిల్ గా ఛార్లి అని పెట్టబోతున్నారని, తమ టీమ్ తో కలిసి వివిధ సమస్యలు సాల్వ్ చేస్తూంటాడని వినికిడి. ఇప్పటికే టీమ్ మొత్తం వరల్డ్ వైజ్ గా ఉన్న పాపులర్ క్రైమ్ థ్రిల్లర్స్ ని డీప్ గా రీసెర్చ్ చేసారని, నక్సల్స్, టెర్రరిస్ట్ లు కూడా ఈ కథలో భాగంగా ఉంటారని సమాచారం. జియోతో కలిసి మహేష్ బాబు తన ఎమ్ బి ప్రొడక్షన్స్ పై నిర్మించనున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సీరిస్ ప్రసారం కానుంది. మహేష్ బార్య నమ్రత ఈ సీరిస్ ని దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు.