'ఇష్మార్ట్ శంకర్'కు మరో బ్యూటి...!

SMTV Desk 2019-01-31 17:00:33  Ismart shankar, Ram pothineni, Poori jagannath, Charmi, Nabha natesh, Nidhi agarwal

హైదరాబాద్, జనవరి 31: సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న సినిమా ఇష్మార్ట్ శంకర్ . ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక విషయంలో పూరి జగన్నాథ్ కొత్తగా ప్రచారం చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి ఇప్పటికే మోడ్రన్ గా ఉండే వొక క్యారెక్టర్ కోసం నిధి అగర్వాల్ ని సెలెక్ట్ చేసిన పూరి జగన్నాథ్ మరో పిల్లను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ కి సమానంగా పోటీపడే హైదరాబద్ పిల్లగా నభా నటేష్ ను సెలెక్ట్ చేశారు.

నన్ను దోచుకుందువటే సినిమాతో గత ఏడాది టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే అందరిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ లో రామ్ సరసన నటించడానికి సిద్ధమైంది. ఇటీవల మొదలైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో ఎండ్ కానుంది. పూరి తరహాలో మాస్ యాక్షన్ ఎపిసోడ్ లు ఈ సినిమాలో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఇదే ఏడాది ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.