టాలీవుడ్ ఫాన్స్ కి పండగే...'RRR'లో మరో హీరో

SMTV Desk 2019-01-31 16:41:59  RRR, Rajamouli, Ram charan, NTR, Prabhas, Alia bhatt

హైదరాబాద్, జనవరి 31: భారత సినిమా ప్రఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తొలిసారి మల్టీ స్టారర్ గా తీస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ . ఈ సినిమా రోజు ఎదో వొక విషయంపై వార్తల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ సినిమా నుండి మరో వార్త వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ తో క్యామియో చేయించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. రీసెంట్ గా ఇదే విషయం గురించి చిత్రబృందంతో చర్చించినట్లు సమాచారం. అదే గనుక జరిగితే వొకే తెరపై రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు ప్రభాస్ ని కూడా చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది.

ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇది ఇలా ఉండగా.. గత వారం రోజులుగా రాజమౌళి విశ్రాంతి తీసుకోకుండా ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన సీన్లను హైదరాబాద్ నగర శివార్లలో వేసిన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఇది పూర్తయిన తరువాత రాజమౌళి హీరోయిన్ల విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు. వొక హీరోయిన్ గా బాలీవుడ్ తార అలియాభట్ ని అనుకుంటున్నారు.