సమంత తెలియక మాట్లాడేసింది...!

SMTV Desk 2019-01-31 16:29:49  Dil raju, Akkineni samantha, Sharvanand, 96, Movie remake

హైదరాబాద్, జనవరి 31: తమిళంలో పెద్ద హిట్ గా నిలిచిన 96 సినిమాను తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్లగా అక్కినేని సమంత, శర్వానంద్ ని కన్ఫర్మ్ చేశారు. మొదట్లో ఈ సినిమాపై స్పందించిన సమంత.. 96 సినిమా వొక క్లాసిక్ అని, దాన్ని ఎవరూ రీమేక్ చేయకపోవడమే మంచిదని కామెంట్స్ చేసింది. కానీ ఊహించని విధంగా రీమేక్ లో హీరోయిన్ గా ఆమెనే ఎంపిక చేశారు. దీంతో సమంత చేసిన వ్యాఖ్యలపై దిల్ రాజు వివరణ ఇవ్వక తప్పలేదు.

ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను విడుదలకు ముందే చూశాను. తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందనిపించి సినిమా హక్కులు తీసుకున్నాను. హీరోయిన్ గా సమంతను అనుకున్నాం. కానీ అప్పటికే సినిమా గురించి మీడియాలో వార్తలు వచ్చేశాయి. దాంతో సమంత అలా స్పందించి ఉంటుందని అన్నారు. ఈ సినిమా టీమ్ లో ఎవరు ఉన్నారో తెలియక అలా మాట్లాదేసిందని.. కచ్చితంగా తెలుగులో ఈ సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నా.. అంటూ చెప్పుకొచ్చాడు.