పెళ్లి కాకుండానే...తల్లి అయిన నిర్మాత

SMTV Desk 2019-01-31 16:02:09  Ekta kapoor, Producer, Gave birth to child, Tushar kapoor

ముంభై, జనవరి 31: ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత ఏక్తా కపూర్ తాజగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నలభై ఏళ్లు దాటినా ఇంకా ఈ లేడీ ప్రొడ్యూసర్ పెళ్లి చేసుకోకుండా సరోగసి పద్ధతి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. జనవరి 27న ఆమె తల్లి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే తన బిడ్డను ఇంటికి తీసుకురానున్నారు. గతంలో ఏక్తాకపూర్ సోదరుడు తుషార్ కపూర్ కూడా ఇలానే సరోగసి పద్ధతి ద్వారా ఓ ఆడబిడ్డకు తండ్రి అయ్యాడు.

ఆ పాపతో ఏక్తాకపూర్ ఎంతో ప్రేమగా మెలిగేది. ఆ చిన్నారితో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఇప్పుడు తమ్ముడి స్ఫూర్తితో తాను కూడా సరోగసి పద్ధతి ద్వారా తల్లైంది. గతంలో ఈమె కొందరు బాలీవుడ్ ప్రముఖులతో డేటింగ్ చేసేదని వార్తలు వచ్చాయి. కానీ ఏది కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. ఏక్తాకపూర్ కూడా పలు సందర్భాల్లో తనకు పెళ్లి చేసుకోవాలని లేదన్నట్లు చెప్పుకొచ్చింది. కానీ పిల్లలపై ఉన్న ఇష్టంతో ఇప్పుడు ఓ బిడ్డకు తల్లిగా మారింది.