పవర్ ఫుల్ సీఎం గా బాలయ్య...!

SMTV Desk 2019-01-31 13:46:06  Nandamuri balakrishna, Boyapati srinivas, Legend, Simha, Chief minister

హైదరాబాద్, జనవరి 31: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే ఈ కాంబినేషన్ లో ఇప్పుడు హట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు బాలయ్య, బోయపాటి. ఈ విషయాన్ని బాలయ్య ఎన్టీఆర్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. అయితే దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ సినిమాలో బాలయ్య కోసం రెండు పాత్రలు డిజైన్ చేశాడట బోయపాటి.

అందులో వొకటి ముఖ్యమంత్రి పాత్ర అని సమాచారం. అయితే ఈ సినిమా కంటే ముందుగానే బాలయ్యని ముఖ్యమంత్రి పాత్రలో చూడబోతున్నారు ఆయన అభిమానులు. ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడు లో నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. అంటే ఆడియన్స్ కి బోయపాటి సినిమాలో బాలయ్య పాత్ర పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లా అనిపించకపోవచ్చు. కానీ బోయపాటి ఎంత పవర్ ఫుల్ గా ఆ రోల్ డిజైన్ చేశాడో చూడాలి. ఫిబ్రవరి మూడో వారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు.