రాజ్ తరుణ్ పరిస్తితి మరీ దారుణం...

SMTV Desk 2019-01-31 13:27:50  Raj tarun, Dil raju, No remuneration, Lover, Rangularatnam, Rajugadu

హైదరాబాద్, జనవరి 31: వరుస డిజాస్టర్లతో మునిగిన యువ హీరో రాజ్ తరుణ్ పరిస్తితి ఇప్పుడు చాలా ఘోరంగా తయారయ్యింది. గతేదాడిలో రంగులరాట్నం , రాజుగాడు , లవర్ ఇలా మూడు చిత్రాల్లో నటించాడు. ఈ మూడు ఫ్లాప్ ల బాట పాట్టాయి. అయితే వీటి వల్ల ఇదివరకు హీరోగా సైన్ చేసిన సినిమాలు అన్ని దర్శకనిర్మాతలు మధ్యలోనే ఆపేసారట. ఇప్పుడు ఇతనితో మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు లవర్ సినిమా నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే తన దగ్గర ఉన్న కథల్లో వొక కథను ఎంపిక చేసి పనులు మొదలుపెట్టాడు.

అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు రాజ్ తరుణ్ కి ఎలాంటి రెమ్యునరేషన్ ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో రాజ్ తరుణ్ కి క్రేజ్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు కూడా రెమ్యునరేషన్ గురించి ప్రత్యేకంగా ఎలాంటి డీల్ మాట్లాడలేదట. దీంతో ఈ సినిమాను ఫ్రీగానే చేయడానికి సిద్ధపడుతున్నాడు రాజ్ తరుణ్. వొకప్పుడు సినిమాకు కోటిన్నర నుండి రెండు కోట్లు డిమాండ్ చేసే ఈ హీరో ఇప్పుడు ఫ్రీగా సినిమా చేస్తుండడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి గైడెన్స్ లేకుండా కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకోవడం వలన రాజ్ తరుణ్ కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటున్నారు.