వర్మను ఒక్కరోజైన పనిచెయ్యాలని కోరిన ప్రభుత్వం

SMTV Desk 2019-01-31 13:17:02  Alok Verma, Rakesh Asthana, CBI Director

న్యూ ఢిల్లీ, జనవరి 31: సీబీఐ మాజీ చీఫ్‌ ఆలోక్‌ వర్మ కేంద్ర ప్రభుత్వ తీరుపై తన పోలీస్ సర్వీస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం కేంద్ర ప్రభుత్వం వర్మను పదవీవిరమణ చేసే వరకూ సర్వీస్ లో కొనసాగాలని ఆదేశించింది. అయితే అలోక్ వర్మ ఈనెల 31న (ఈరోజు) పదవివిరమణ చేయాల్సి ఉంది. దీంతో ఈ వొక్కరోజు అయిన ఆయనను పనిచెయ్యాలని హోంమంత్రిత్వ శాఖ కోరింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మను తొలగించిన ప్రభుత్వం ఆయనను ఫైర్‌ సర్వీసుల డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేసింది.

సీబీఐ చీఫ్‌గా తనను తొలగించడాన్ని తప్పుపట్టిన వర్మ ఫైర్‌ సర్వీసు డైరెక్టర్‌ నుంచి కూడా వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, జాయింట్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వీరి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇద్దరినీ సెలవుపై పంపింది. అకారణంగా ప్రభుత్వం తనను సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ ఆలోక్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా వర్మ తిరిగి సీబీఐ పగ్గాలు చేపట్టిన ప్రభుత్వం బదిలీ చేసింది. రాకేశ్ ఆస్థానాను కూడా వేరే శాఖకు బదిలిచేసింది.