వ్యూహం రచిస్తున్న ఏపీ కాంగ్రెస్..

SMTV Desk 2019-01-31 13:16:56  AP congress, Vijayawada, AP, Congress, Raghuveera Reddy, Oommen Chandy

విజయవాడ, జనవరి 31: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్బంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచించే పనిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు విజయవాడలో ఏపీ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఏపీలోని 175 నియోజకవర్గాల కాంగ్రెస్ కన్వీనర్లతో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి ఉమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీలో అడుగు పెట్టడం, ప్రత్యేక హోదాపై రాహుల్ తొలి సంతకం, ఏపీలో ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాల్సిన వ్యూహంపై ప్రధాన చర్చ జరగనుంది.