అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్ట్

SMTV Desk 2019-01-31 12:54:46  Amarica, Home land security, Under cover operation, Indian students arrest in USA

అమెరికా, జనవరి 31: అమెరికాలో నిభంధనలకు విరుద్ధంగా నకిలీ యూనివర్సిటీ లో విద్యార్థులుగా చేరి అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అండర్ కవర్ ఆపరేషన్-పేజ్ ఛేజ్ లో భాగంగా హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ అయిన భారతీయులలో 8 మంది తెలుగు వారు కూడా ఉన్నారు. అంతేకాకుండా వీరికి సహకరించిన భారత సంతతికి చెందిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేసారు.

అమెరికాలో అక్రమ వలసదారుల గుట్టు రట్టు చేయడానికి హోం ల్యాండ్ అధికారులు వొక సీక్రెట్ అండర్ కవర్ ఆపరేషన్ ను చేపట్టారు. ఇందులో భాగంగా వొక నకిలీ యూనివర్శిటీని ఏర్పాటు చేసి 900మందిని విద్యార్థులుగా చేర్చుకున్నారు. వీరందరూ అక్రమంగా యూనివర్సిటీలో చేరి విద్యార్థి వీసాలను పొందారు. వీరందరూ అమెరికాలో అక్రమంగా నివసిస్తునట్లు తేలడం తో ఇమ్మిగ్రేషన్ అధికారులు వీరిని అరెస్ట్ చేసారు. వీరిలో చాలామంది భారత్ కి చెందిన వారే ఉన్నారు. వీరందరినీ యూనివర్సిటీ లో చేర్చడానికి సహకరించిన 8 మంది దళారులను కుడా అరెస్ట్ చేసారు.