పాయల్ రాజ్ పుట్...ఐటెం గర్ల్...!

SMTV Desk 2019-01-31 12:35:23  Payal rajput, RX 100 Movie heroin, Bellamkonda srinivas, Kajal agarwal, Director Teja, Seetha, Item song

హైదరాబాద్, జనవరి 31: వరుస సినిమాలతో దూసుకుపోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ మధ్య వచ్చిన కవచం సినిమా ఊహించని వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే దాని తరువాత మరో సినిమాకి సిద్దమయ్యాడు బెల్లం బాబు. తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సీత అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా మళ్ళీ కాజల్ అగర్వాల్ తో జోడీ కడుతున్నాడు సాయి. ఇక గత కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసి మార్చిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కి చర్చలు జరుపుతున్నారు సినీ బృందం. ఐటెం సాంగ్ పెడితే ఏ హీరోయిన్ తో పెట్టాలో అని కూడా ఆలోచనల్లో పడ్డారు. RX100 సినిమాతో యువత మతిపోగోట్టిన బ్యూటి పాయల్ రాజ్ పుట్ ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయాడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలొస్తున్నాయి. అంతేకాక ఈ పాటకి ఈ బ్యూటి అధిక మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకొంటుంది అని సమాచారం. మరి ఈ వార్తను పాయల్ కొట్టిపడేస్తుందో లేక అది నిజమే అని ముందుకెల్తుందో చూడాలి.