వైసీపీతో భాజపా కుమ్మక్కు...?

SMTV Desk 2019-01-31 12:35:16  AP, CM Chandrabbu, teliconfarence, TDP Leaders, KCR, YS Jagan, Narendra Modi, BJP, TDP, YCP, TRS

అమరావతి, జనవరి 31: ఈరోజు అమరావతిలో టీడీపీ నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఢిల్లీలో ధర్మపోరాటానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఢిల్లీలో దీక్షకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఆందోళనలు, ర్యాలీలు జరపాలన్నారు. ఈ ర్యాలీలో రైతులు, మహిళలు, ప్రజలందరు టీడీపీకి అదనపు బలం అని సీఎం పేర్కొన్నారు. ఇకఅమరావతిని హైదరాబాద్ లాంటి నగరం నిర్మించడానికి 20ఏళ్లు పడుతుందన్నారు. అయితే అందుకు కావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మనపై దాడులు చేస్తోందని సీఎం మండిపడ్డారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతకానితనం ప్రజలకు శాపంగా మారింది. మరల అన్నాహజారే దీక్ష చేసే దుస్థితి వచ్చిందన్నారు. ఇక వైసీపీతో భాజపా కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కేసీఆర్, జగన్ కూడపలుక్కొని ఏపీకి నష్టం చేస్తున్నారు. మూడు పార్టీలు లాలూచి పడి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. లోక్ పాల్ ను నియమిస్తామని చెప్పి మోడీ మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ నే కాదు అన్నాహజారేను బీజేపీ మోసం చేసింది. అన్ని వ్యవస్థలు కుంటుపడేలా ప్రధాని మోదీ నిర్వాకాలు ఉన్నాయి. అయిన మోదీని నిలదీసే ధైర్యం జగన్ కు లేదని సీఎం వ్యాఖ్యానించారు.