జాతీయ రహదారి కోసం భూములు ఇవ్వబోమన్న రైతులు

SMTV Desk 2019-01-31 11:56:03  Telangana farmers, Khammam-Devarapalli highway, Revenue Officers

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణా ప్రభుత్వం ఖమ్మం-దేవరపల్లి నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేపట్టనుంది. దీనికోసం రెవెన్యూ అధికారులు తల్లాడ మండలం లక్ష్మీపురం, రామానుజవరం గ్రామాల్లో సర్వేను చేపట్టారు. అయితే హై వే రోడ్డు నిర్మాణం కోసం రైతులు తమ భూములు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నేపథ్యం లో మండలాలలోని రైతులు అధికారుల సర్వేను అడ్డుకున్నారు. అధికారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైతు జిల్లా జేఏసీ నేతలు పోలీస్ స్టేషన్ కు వచ్చి రైతులను కలిసారు. వారితో కూడా రైతులు తమ భూములను రహదారి కోసం ఇచ్చేది లేదని స్పష్టం చేసారు.