నాతో మాట్లాడటానికి 919****996కి ఫోన్ చేయండి : జగన్

SMTV Desk 2019-01-31 11:44:35  Jaganmohan Reddy, ap elections 2019, anna pilupu letters

అమరావతి, జనవరి 31: ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్, రాష్ట్రంలోని ఉద్యోగులకు స్వయంగా అన్న పిలుపు లేఖలు రాస్తూ, రాష్ట్ర ప్రగతికి సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక గత రెండు రోజులుగా ఈ లేఖలు వైఎస్ జగన్ సంతకంతో ఉద్యోగులకు అందుతున్నాయి. వీటిపై పార్టీ గుర్తు అయిన ఫ్యాన్, జగన్ ఫోటోలు కూడా ఉన్నాయి. కాగా లేఖ సారాంశం ఏమిటంటే...

నమస్కారం (ఉద్యోగి పేరు)

మీరు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మిమ్మల్ని కలిసి ఏపీ ప్రగతికి మీ సలహాలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. నేను మీ వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డిని.

ఉభయకుశలోపరి, మీరు ఉద్యోగి అని తెలుసుకున్నాను. మీ ద్వారా గ్రామస్తులు ప్రయోజనం పొందడానికి కృషి చేస్తున్నందుకు నా అభినందనలు. మీరు ఇదేవిధంగా తోటి వారికి సహాయం చేస్తూ మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను.

ఏపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. 429 రోజులు నేను చేసిన పాదయాత్రలో మీ గుండెచప్పుడు విని నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. పాదయాత్రలో భాగంగా మీలాంటి ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలుసుకోవడం నా అదృష్టం. ఏపీ ప్రగతి కోసం నేను రూపుదిద్దే కార్యాచరణ కోసం మీ విలువైన సలహాలు, సూచనలు తెలుసుకోవాలనుకుంటున్నాను. నాతో మాట్లాడటానికి 9199691996 ఫోను నెంబరుకు సంప్రదించండి.
ఇట్లు
మీ
వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి.