తెలంగాణా పంచాయతీ ఎన్నికల ఫలితాలు

SMTV Desk 2019-01-31 11:32:21  Telangana Panchayat polls Results, Ellection commission, TRS, Congress BJP, CPM,CPI,

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మూడు విడతల్లో జరిగిన ఎన్నికలలో మొత్తం 86 శాతం పైగానే పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అధికారులు ఫలితాలను వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలలోను టీఆర్ఎస్ సత్తా చాటింది. టీఆర్ఎస్ అభ్యర్దులు 7,731 స్థానాల్లో విజయం సాధించి 61 శాతం పంచాయితీలను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్దులు 2,698 స్థానాల్లో విజయం సాధించి, 22 శాతం సర్పంచ్ సీట్లను సంపాదించారు. బీజేపీ 163, టీడీపీ 82, సీపీఎం 77, సీపీఐ 50 స్థానాలలో విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్దులు 1,825 గ్రామాల్లో గెలిచి, 14 శాతం పంచాయితీలను కైవసం చేసుకున్నారు.

గెలిచిన సర్చంచ్ లు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ లు ఫిబ్రవరి 2 న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే రోజు తొలి గ్రామసభ నిర్వహిస్తారని పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ గేజిట్ విడుదల చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిసర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనున్నాయి.