నేడు ఏపీ మంత్రి వర్గం కీలక భేటీ..

SMTV Desk 2019-01-31 11:21:30  Chandrababu, ap cm, ap ministers, ministers meeting

అమరావతి, జనవరి 31: ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీకానుంది. ఎన్నికలు దగ్గరకి వస్తుండటం, చివరి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రముఖంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న డ్వాక్రా చెక్కు పంపిణీ, పెన్షన్ల పండుగ, గృహప్రవేశాలపై చర్చించనున్నారు. ఇంకా రైతులకు సాయంగా రూ.2500 ఇవ్వాలని, రానున్న సంవత్సరం నుంచి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కాగా ఈ పధకానికి పేరు నిర్ణయించే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.


ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు నష్ట పరిహారం చెల్లింపుపైనా చర్చిస్తారు. అలాగే విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం మొండిచెయ్యి చూపించడం, ప్రత్యేక హోదా కోసం చేపట్టనున్న నిరసన కార్యక్రమాల కార్యాచరణ ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ప్రత్యేక హోదా ఉద్యమ కారులపై కేసులు ఎత్తివేస్తామని సీఎం ప్రకటిస్తే ఈ అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలిపనున్నట్లు సమాచారం.