‘లుక్కా చుప్పి' పై భారీ ఆశలు పెట్టుకున్న బ్యూటి

SMTV Desk 2019-01-30 19:42:29  Luka Chuppi, Kartik Aaryan, Kriti Sanon, Dinesh Vijan, Laxman Utekar

ముంభై, జనవరి 30: తెలుగులో నేనొక్కడినే , దోచేయ్ వంటి సినిమాలతో పరిచయమైన బాలీవుడ్ బ్యూటి కృతిసనన్‌ కు పెద్దగా విజయాలు లేవు. అటు హిందీలోను ఈ బ్యూటికి పెద్దగా కలిసిరాలేదు. ‘హీరోపంటి , బరేలీ కీ బర్ఫీ వంటి సినిమాలు ఓ మోస్తరుగా మెప్పించాయి. చాలా రోజుల నుంచి ఈ బ్యూటీ వొక మంచి కమర్షియల్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తోంది. కృతి తాజా చిత్రం ‘లుక్కా చుప్పి ఈ ఏడాది మార్చి1 న విడుదల కాబోతోంది.

ఈసినిమాపై అమ్మడు బోలెడు నమ్మకంతో ఉంది. కార్తీక్‌ అర్యన్‌ హీరోగా నటించిన ఈసినిమా ప్రొమోలు ఇప్పటికే ఆసక్తి కలిగిస్తున్నాయి. హీరో హీరోయిన్లు లివిన్‌ రిలేషన్‌లో ఉండాలని అనుకోవటం కానీ ఇద్దరు మాత్రమే కాకుండా వొక పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఈ భార్యాభర్తల ముసుగులో ఈ లివిన్‌ రిలేషన్‌ కొనసాగించటం అందులో తమ కష్టాలు. ఇలా ఫన్నీగా ఈచిత్రం కథ సాగుతోందని తెలిసింది. కామెడీతో పాటు కృతి కూడ గ్లామర్‌ బాగానే వొలకబోసిందని అంటున్నారు ప్రేక్షకులు.