చంద్రబాబు జులాయి....!!!!

SMTV Desk 2019-01-30 19:29:59  Chandrababu, ap cm, tdp, gvl narasimha rao, bjp

విజయవాడ, జనవరి 30: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈరోజు విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురంలో స్థాపించిన కియా మోటార్స్‌కూ, చంద్రబాబుకూ ఎలాంటి సంబంధం లేదని జీవీఎల్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వల్లే కియా మోటార్స్ ఏపీకి వచ్చిందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లు జులాయిగా తిరిగిన చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు దుబారా చేస్తున్న సొమ్ము ప్రజలదని.. సోకులు చేసుకోవడానికి కాదని.. కేంద్రం ప్రకటించిన రూ.900 కోట్ల నిధులను కరవు ప్రాంతాలకే వాడాలని సూచించారు.

ఈ నిధులపై తమ నిఘా ఉంటుందని జీవీఎల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మారుస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్షల ఇళ్లను నిర్మిస్తోందని గుర్తు చేసారు. ఈరోజు టీడీపీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు ఏకాకిలా మిగిలారని.. కనీసం రెండు పార్టీలను కూడా కలుపుకోలేని చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం పోరాడుతారని ప్రశ్నించారు.