దొంగ దెబ్బ కొడుతున్నారు : చంద్రబాబు

SMTV Desk 2019-01-30 18:38:03  Chandrababu, TDP, BJP, kanna lakshminarayana

అమరావతి, జనవరి 30: ఈరోజు టీడీపీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నన్ను దొంగ దెబ్బతీసేందుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారని అన్నారు. తమపై కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిలో దాడి చేస్తుందని చంద్రబాబు విమర్శించారు. ఈ కారణంగానే ఏపీలోకి సీబీఐకు అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు.

అయితే సీబీఐకి రాష్ట్రంలో అనుమతివ్వని కారణంగా ఈడీని ప్రయోగించి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎవరు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేకుండా కేసులు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.