వివాదాల్లో 'సైరా' మేకర్స్...!

SMTV Desk 2019-01-30 17:52:48  Syera narshimhareddy, Chiranjeevi, Surendher reddy, Ram charan, Konidela productions

హైదరాబాద్, జనవరి 30: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి . ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యేసరికి అలాగే అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ కావడంతో దర్శకుడికి, నిర్మాతకు మధ్య వివాదం ఏర్పడిందని సినీ వర్గాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ముందు 150 కోట్లతో అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఏకంగా 200 కోట్లకు చేరిపోవడంతో ఆ టెన్షన్ చరణ్ లో కనిపిస్తుందంటున్నారు చిత్ర యూనిట్.

సురేందర్ రెడ్డి కూడా పర్పెక్షన్ పేరుతో తీసిన సీన్స్ మళ్లీ ఎక్కువగా రీ షూట్ చేస్తున్నాడనే వాదన వినిపిస్తుంది. ఇదే దర్శకుడికి , నిర్మాతకు మధ్య వాగ్వాదం జరిగే వరకు తీసుకొచ్చిందని తెలుస్తుంది. అయితే ఏదేమైనా వస్తున్న ఔట్ పుట్ చూసి రామ్ చరణ్ ఫిదా అవుతున్నాడని కాకపోతే కాస్త ఆలస్యం అవుతున్న కారణంగానే కోపంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. దీన్ని కూడా సురేందర్ రెడ్డి త్వరలోనే పూర్తి చేస్తాడని , ఇప్పటి వరకు కేవలం 60 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి కావడంతో దసరాకు సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి.