అనసూయ 'కథనం'

SMTV Desk 2019-01-30 17:46:49  Anchor Anasuya bharadwaj, Kathanam movie, New movie, Telugu film, Assistant director role, Jabardasth

హైదరాబాద్, జనవరి 30: జబర్దస్త్ షో తో క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ సినిమాలతో ను మంచి క్రేజ్ సంపాదించుకొంది. రంగస్థలం,క్షణం సినిమాల ద్వారా అనసూయా లో వున్నా మరో కోణం బయట పడింది. ఇపుడు ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌థ‌నం. బి.న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ మెయిన్ లీడ్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం రెండు పాటలు మిన‌హా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని స‌మ్మర్‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

ఈ సంద‌ర్భంగా అన‌సూయ మాట్లాడుతూ... క‌థ‌నం సినిమా పేరు. క‌థ‌నం అంటే క‌థ‌ని న‌డిపే విధానం మా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన త‌ర్వాత చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నేను క్షణంలో క‌నిపించిన పాత్రలో ఉన్నట్లు ఉంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కాని కాదు నాది ఈ చిత్రంలో వొక అసోసియేట్ డైరెక్టర్ పాత్ర‌. నాకు సహకరించిన మా యూనిట్ అంద‌రికీ కృత‌జ్ఞత‌లు అన్నారు.