కంగనాకు డైరెక్టర్ కు ఉండాల్సిన లక్షణాలు లేవు...?

SMTV Desk 2019-01-30 16:16:24  Kangana ranaut, Krish jagarlamudi, Misti chakravarti, Manikarnika

ముంభై, జనవరి 30: మణికర్ణిక వివాదం రోజురోజుకి మరింత వేడెక్కుతూ పోతోంది. అనేకమంది ప్రముఖులు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. అయితే ఈ వివాదంపై మణికర్ణిక సినిమాలో కశీబాయి పాత్రలో నటించిన మిష్టి చక్రవర్తి తాజాగా స్పందించారు. సినిమాలో తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఎ వివాదంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సినిమాలో కంగనా తన పాత్ర నిడివి తగ్గించిన విధానం చూసిన బాధపడినట్లు వెల్లడించింది. క్రిష్ ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి అని ఆయనతో కలిసి పని చేయాలని ఎప్పుడూ అనుకునేదాన్ని అంటూ ఆ అవకాశం మణికర్ణిక తో రావడం సంతోషంగా భావించానని అందుకే సినిమా వొప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ సినిమా చూసిన తరువాత చాలా బాధపడినట్లు స్పష్టం చేసింది. క్రిష్ తన పాత్రకు ఇచ్చిన నిడివి, ప్రాధాన్యత సినిమాలో కనిపించలేదని కంగనా తన పాత్రను క్యారికేచర్ లా మార్చేశారని వెల్లడించింది. కంగనాకు డైరెక్టర్ కు ఉండాల్సిన లక్షణాలు లేవని తెలిపింది. డైరెక్టర్ ఎవరైనా సినిమాలో అన్ని పాత్రలను సమానంగా ప్రేమిస్తారు కానీ కంగనామాత్రం తన పాత్రను మాత్రమే ప్రేమించిమిగిలిన పాత్రలను పట్టించుకోదని కామెంట్స్ చేసింది.